రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆరే: జీవన్ రెడ్డి

రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆరే: జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆరేనని అన్నారు. కేసీఆర్ సెక్రటేరియట్ కు రాకుండా  పాలన వ్యవస్థను ప్రశ్నించడం విడ్డురంగా ఉందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత  సమాచార హక్కు చట్టంను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు కోట్లు ఖర్చు పెట్టారని.. అవి ఎక్కడ నుండి వచ్చాయని ప్రశ్నించారు. కమిషన్ లతో వచ్చిన  సొమ్మునే ఎన్నికలకు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

ప్రాజెక్టుల  రిడిజైన్ పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతున్న పట్టించుకోవడం లేదని నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. వర్కింగ్ ఎస్టిమేషన్ లేకుండా పనులు చేస్తున్నారని..రీ ఇంజినీరింగ్ లో కూడా అవినీతి జరుగుతుందని ఆరోపించారు .దీనిపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా విచ్చల విడిగా సాగుతోందని విమర్శించారు. సెక్రటేరియట్ లోకూడా అవినీతి ఉందన్నారు నాగం.