కామ్రేడ్లకు నాలుగు సీట్లు మాత్రమే : కాంగ్రెస్ నిర్ణయం ఇదేనా

కామ్రేడ్లకు నాలుగు సీట్లు మాత్రమే : కాంగ్రెస్ నిర్ణయం ఇదేనా

తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సీపీఎం, సీపీఐ పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్  నిర్ణయించింది.  ముందుగా రెండు పార్టీలకు చెరోక సీటు ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకురాగా అందుకు  కామ్రేడ్లు తిరస్కరించారు.  దీంతో చెరో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.  

సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు, సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడలను కేటాయించినట్లుగా తెలుస్తోంది.   భద్రాచలంలో కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సీపీఎం కి ఇవ్వాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.   

ALSO READ : అయ్యో ఎంత పనయ్యే... ట్రంప్ కుల్ఫీ అమ్ముతున్నడు..అది పాకిస్తాన్లో...

ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం నేతలు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నుంచి,  తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు నుంచి  బరిలోకి దిగుతున్నట్లుగా సమాచారం.  అటు సీనియర్ నేత పోడెం వీరయ్యను పినపాక స్థానం నుంచి నిలబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.