అయ్యో ఎంత పనయ్యే... ట్రంప్ కుల్ఫీ అమ్ముతున్నడు..అది పాకిస్తాన్లో...

అయ్యో  ఎంత పనయ్యే... ట్రంప్ కుల్ఫీ అమ్ముతున్నడు..అది పాకిస్తాన్లో...

అయ్యో ..అయ్యో..అయ్యో..ఎంత పనయ్యే..అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్..కుల్ఫీలు  అమ్ముకుంటుండు. అది కూడా పాకిస్తాన్లో.  పాపం కదా...రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతానని..మరోసారి అమెరికాకు అధ్యక్షుడిని అవుతానని స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్..ఇలా పాకిస్తాన్ లో కుల్ఫీలు అమ్ముకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఆశ్చర్యపోతున్నారా..?  

కుల్ఫీలు అమ్ముతున్న ట్రంప్..నిజమేనా..?

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ సాహివాల్ జిల్లాలో ఈ డొనాల్డ్ ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు. అయితే అతను నిజమైన డొనాల్డ్ ట్రంప్ కాదు. అచ్చం ట్రంప్ పోలికలు ఉన్న  చాచా బగ్గా. అతని వృత్తి కుల్ఫీలు అమ్మడం.  ఈ చాచా బగ్గా..అచ్చం డొనాల్డ్ ట్రంప్ ను పోలి ఉంటాడు. ముఖం, వెంట్రుకలు, పర్సనాలిటీ చూస్తే..సేమ్ టూ సేమ్ డొనాల్డ్ ట్రంప్ ను చూస్తున్నట్లే ఉంటుంది. ప్రస్తుతం ఈయన వీడయోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ చాచా బగ్గా కుల్ఫీలను మామూలుగా ..సాధారణ కుల్ఫీలు అమ్మే వ్యక్తిలా అమ్మడు. తన మంత్రముగ్ధమైన స్వరంతో  పాటలు పాడుతాడు. వీధికి ఇటు చివరన పాట పాడితే..వీధికి అటు వైపు ఇంట్లో ఉన్న మనుషులకు వినిపిస్తుంది. చిన్నారులు, పెద్దవాళ్లు కూడా..చాచా బగ్గా వచ్చాడు...అని ఇట్టే గుర్తు పట్టేస్తారు.  ఏయ్ కుల్ఫీ..కుల్ఫీ.. ఆ ఖోయా కుల్ఫీ, కుల్పీ అంటూ జనాలను తన స్వరంతో ఆకర్షిస్తాడు. 

  
చాచా బగ్గా వీడియోలు 2021లోనూ వైరల్ అయ్యాయి. 2021 జూన్ లో డొనాల్డ్ ట్రంప్ కుల్ఫీలు అమ్ముతూ..పాటలు పాడుతున్న వీడియో  ఇంటర్నెట్ లో యూజర్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను పాకిస్తాన్ గాయకుడు  షెహజాద్ రాయ్ పంచుకున్నాడు. వాహ్ కుల్ఫీ వాలే భాయ్...క్యా బాత్ హై అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో జనానికి మస్తు రీచ్ అయింది.