3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు మిగిలి ఉన్న క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3ఎంపీ, 11ఎమ్మెల్యే స్థానాలకు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. నరసాపురం ఎంపీ స్థానానికి బ్రహ్మానందరావు, రాజంపేట ఎంపీ స్థానానికి ఎస్ కే బషీద్, చిత్తూరు ఎంపీ స్థానానికి ఎమ్ . గజపతిల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణ,  శృంగవరపుకోట అసెంబ్లీ స్థానానికి జీ. తిరుపతి, విజయవాడ పశ్చిమం అసెంబ్లీ స్థానానికి పీ. నాంచారయ్య, తెనాలికి సాంబశివుడు, బాపట్లకు అంజిబాబు, సత్తెనపల్లికి చంద్రపాల్, కొండెపి అసెంబ్లీ స్థానానికి పీ.సుధాకర్, మార్కాపురం అసెంబ్లీ స్థానానికి జావేద్, కర్నూల్ స్థానానికి షేక్ భాషా, ఎమ్మిగనూరు స్థానానికి ఖాసీం వలి, మంత్రాలయం స్థానానికి మురళీ కృష్ణరాజుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. 

Also Read:మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్