హైదరాబాద్, వెలుగు: ‘సర్’ ప్రకియను పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు పీసీసీ రాష్ట్ర నాయకత్వానికి చేరవేసేందుకు వీలుగా కంట్రోల్ రూంలకు కో ఆర్డినేటర్లను కాంగ్రెస్ నియమించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ శుక్రవారం ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియను గాంధీ భవన్ లో ఉన్న కంట్రోల్ రూంకు చేరవేసేందుకు వీలుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసిన పీసీసీ.. దానికి సీనియర్ నేతలను కో ఆర్డినేటర్లుగా నియమించింది. ఇందులో పీసీసీ నేతలతో పాటు పలు కార్పొరేషన్ ల చైర్మన్ లు ఉన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ కు కోల్కొండ సతీశ్, పెద్దపల్లికి శశిభూషన్ కాచే, కరీంనగర్ కు మద్దెల సంతోష్, నిజామాబాద్ కు బొమ్మ శ్రీరాం, జహీరాబాద్ కు జూలూరి ధనలక్ష్మి, మెదక్ కు జీవీ వెన్నెల, మల్కాజిగిరికి సుబ్రమణ్యం పొన్నాడ, సికింద్రాబాద్ కు రాఘవేంద్ర రెడ్డి, హైదరాబాద్ కు అచ్యుతా యాదవ్, చేవెళ్లకు జగదీశ్వర్ రావు, మహబూబ్ నగర్ కు రేవతి గౌడ్, నాగర్ కర్నూల్ కు ఒబెదుల్లా కొత్వాల్, నల్గొండకు కస్బ శ్రీనివాస్ రావు, భువనగిరికి లింగం యాదవ్, వరంగల్ కు ఇర్షాద్ నసీర్, మహబూబాబాద్ కు నూతి శ్రీకాంత్, ఖమ్మంకు జి. రాఘవేందర్ ను కంట్రోల్ రూం కో ఆర్డినేటర్లుగా పీసీసీ చీఫ్ నియమించారు. ఇక పీసీసీ తరఫున ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా పులిపాటి రాజేశ్, పీసీసీ కో ఆర్డినేటర్ గా గంప వేణుగోపాల్ ను నియమించారు.
