ఓటర్ల జాబితా నుంచి 6 కోట్ల పేర్ల తొలగింపు

ఓటర్ల జాబితా నుంచి 6 కోట్ల పేర్ల తొలగింపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) ప్రక్రియ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సర్​కారణంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు.

విపక్షాలు, ఎన్నికల సంఘం మధ్య ఈ వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. గతేడాది జూన్ 24న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను తొలిసారిగా ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.