తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ సమావేశం

తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ సమావేశం

ఢిల్లీలో ఏఐసీసీ(A ICC) చీఫ్ ఖర్గే అధ్యక్షతన  కాంగ్రెస్  సెంట్రల్ ఎలక్షన్ కమిషన్  సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి  సోనియాగాంధీతో పాటు, రాష్ట్ర  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్  దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. 

ఇప్పటికే 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సీఈసీ.. మిగిలిన నాలుగు స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. పెండింగ్ లో ఉన్న  ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Also Read :టీ రూ.15, బిర్యానీ రూ. 150..అభ్యర్థులకు రేట్ ఫిక్స్ చేసిన ఈసీ

రేపటి నుంచి( మంగళవారం) ప్రచారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఏప్రిల్ 6న చేవెళ్లలో నిర్వహించనున్న జన జాతర సభతో రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఊపు రానుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

 
.