టీ రూ.15, బిర్యానీ రూ. 150..అభ్యర్థులకు రేట్ ఫిక్స్ చేసిన ఈసీ

టీ రూ.15,  బిర్యానీ రూ. 150..అభ్యర్థులకు రేట్ ఫిక్స్ చేసిన ఈసీ

 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం ఫిక్స్  చేసింది. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనే వారికి అందించే చాయ్, సమోసా నుంచి బిరియానీ వరకు ఎంతెంత ఖర్చు పెట్టారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటును ఈసీ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు మారనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక అభ్యర్థి గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చుపెట్టుకోవచ్చు. అరుణాచల్  ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో ఈ ఖర్చును రూ.75 లక్షలకు ఈసీ తగ్గించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో అభ్యర్థి రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు ఖర్చుపెట్టాలి. పంజాబ్ లోని జలంధర్ లో ఒక కప్పు చాయ్, సమోసాకు రూ.15గా ఈసీ ఫిక్స్  చేసింది. 

చోళె భటూరే కు రూ.40, కిలో మటన్ కు రూ.500, కిలో చికెన్ కు రూ.250 ఖర్చు చేయాలి. కిలో ధోధా స్వీట్ కు రూ.450, కిలో ఘీ పిన్నీకి రూ.300గా నిర్ణయించింది. ఇక గ్లాసు లస్సీకి రూ.20, నిమ్మరసానికి రూ.15గా ఫిక్స్  చేసింది. అలాగే మధ్యప్రదేశ్​లోని మాండ్లలో కప్పు టీకి రూ.7, సమోసాకు రూ.7.50 ఖర్చు పెట్టాలని సూచించింది. బాలాఘాల్ లో కప్పు చాయ్ పై రూ.5, సమాసాపై రూ.10, ఇడ్లీ, సాంబార్  వడ, పోహా జిలేబీ, దోసపై రూ.20, ఉప్మాపై రూ.30 వ్యయం చేయాలి. ఇక మణిపూర్ లోని థౌబాల్  జిల్లాలో టీ, సమోసా, కచోరీ, ఖజూర్, గాజాపై అభ్యర్థులు ఒక్కోదానికి రూ.10 ఖర్చుపెట్టుకోవచ్చు. తెంగ్ నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీకి రూ.5, సాధారణ టీకి రూ.10 ఖర్చుపెట్టాలి.

చెన్నైలో చాయ్ పై రూ.15

చెన్నైలో అభ్యర్థి చాయ్​పై పెట్టే ఖర్చును రూ.15, కాఫీకి రూ.20 కి ఈసీ పెంచింది. చికెన్  బిర్యానీ రేటు రూ.150కు తగ్గించింది. గ్రేటర్  నోయిడాలో వెజ్  థాలీ ధరను రూ.100గా, సమోసా, టీ ధరను రూ.10గా, శాండ్ విచ్ రేటును రూ.25గా, కిలో జిలేబీ ధరను రూ.90గా ఈసీ ఫిక్స్ చేసింది. నార్త్  గోవాలో బటాటా వడ ప్రైస్ ను రూ.15గా, సమోసా ధరను రూ.15గా నిర్ణయించింది. అలాగే హర్యానాలోని జింద్​లో అభ్యర్థులు తందూర్​పై రూ.300, మిక్స్ వెజ్ పై రూ.130 ఖర్చుపెట్టుకోవచ్చు. ఇక మటర్  పనీర్  ధరను రూ.160కు ఈసీ పెంచింది