బీజేపీ అంటే.. భ్రష్ట్ జనతా పార్టీ : ఉద్ధవ్ థాక్రే

బీజేపీ అంటే.. భ్రష్ట్ జనతా పార్టీ : ఉద్ధవ్ థాక్రే

ఎలక్టోరల్ బాండ్ల స్కాంతో బీజేపీ అత్యంత అవినీతి పార్టీగా అవతరించిందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, ఇప్పుడు బీజేపీ అంటే ‘భ్రష్ట్ జనతా పార్టీ’ అంటూ అభివర్ణించారు.  ఇండియా కూటమి ర్యాలీలో మాట్లాడిన ఆయన.. దేశంలో అరాచకం పెరిగిందని, ఆయనను గద్దె దింపాలని ఉద్ధవ్ థాక్రే పిలుపునిచ్చారు. ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదని, తమ భర్తల కోసం పోరాడుతున్న ఇద్దరు చెల్లెండ్లు సునీత, కల్పనకు సంఘీభావం తెలిపేందుకే వచ్చామన్నారు.  

సింహాన్ని ఎక్కువ రోజులుబంధించలేరు: సునీతా కేజ్రీవాల్  

నియంతృత్వం ఎల్లకాలం సాగదని, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఎక్కువ రోజులు జైలులో ఉంచలేరని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆదివారం ఆమె తొలిసారిగా రాజకీయ వేదికపై మాట్లాడారు. ఈడీ కస్టడీ నుంచి  కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఈ సభలో సునీత చదివి వినిపించారు. ఇండియా కూటమి తరఫున దేశ ప్రజలకు ఆయన ఆరు గ్యారంటీలను ఇచ్చారని వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా కూటమి తరఫున ఈ ప్రకటన చేస్తున్నందుకు తనను క్షమించాలని నేతలను ఆమె కోరారు. ‘‘నేను ఈ రోజు మిమ్మల్ని ఓట్లు అడగను. ఎరినీ ఓడించాలని, గెలిపించాలనీ కోరను.