ఈడీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ఈడీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

బీదర్: కాంగ్రెస్ కు చెందిన కొంత మంది నేతలు ఈడీ, ప్రధాని మోదీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారని ఆ పార్టీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో మంత్రులు, చీఫ్​ మినిస్టర్లు వంటి పదవులను లబ్ధి పొందిన వారు కూడా ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన కొంత మందికి సిద్ధాంతాలపై బలమైన నమ్మకం లేదని తెలిపారు. అందువల్ల  అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని చెప్పారు.  

బీదర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఖర్గే ప్రసంగించారు. “కాంగ్రెస్ లో ఉన్న  వారు  మంత్రులు, సీఎం వంటి పదవులను పార్టీ నుంచి లబ్ధి పొందారు. అయితే మోదీ, ఈడీకి భయపడి వారు బీజేపీ వైపు పరిగెత్తుతున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకున్నారు. 

కానీ, ప్రజలు ఎన్నుకున్న నాయకులకు కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం లేకపోవడంతో  ఆ ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టింది. కొందరు డబ్బు కాంక్ష, మరికొందరు అధికార కాంక్ష, పార్టీలోని మరొకరితో విభేదాలను ఉదాహరించి బీజేపీలో చేరుతున్నారు. ధైర్యం లేని వారు ఎప్పటికీ విజయం సాధించలేరు”అని ఖర్గే  స్పష్టం చేశారు.