
- బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
న్యూఢిల్లీ, వెలుగు: ఓపెన్ కేటగిరీలో రిజర్వ్‌డ్ వర్గాల వారు రాకుండా చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఓపెన్ కేటగిరీలో రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లు ఉంటాయంటూ కేవలం నోటి మాటలే చెబుతున్నారన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో గ్రూప్1 అభ్యర్థుల పిటిషన్‌పై జరిగిన వాదనల్లో దాసోజు హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత కోర్టు ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29 బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందన్నారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ చేపట్టే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.