మునుగోడు అసెంబ్లీ వ్యూహ ప్రచార కమిటీ ప్రకటించిన కాంగ్రెస్

మునుగోడు అసెంబ్లీ వ్యూహ ప్రచార కమిటీ ప్రకటించిన కాంగ్రెస్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఉప ఎన్నిక వచ్చే అవకాశముండటంతో ఆ నియోజకవర్గ  ఎన్నికల వ్యూహం, ప్రచారం కోసం ఏఐసీసీ ఓ కమిటీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ ప్రకటించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహం, ప్రచార కమిటీలో ఏడుగురికి చోటు కల్పించింది. మధుయాష్కీ గౌడ్ కమిటీ కన్వీనర్ గా ఉండగా.. రాం రెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, ఎస్ఏ సంపత్ కుమార్. ఈరవత్రి అనిల్ కుమార్ లను సభ్యులుగా నియమించింది.