సర్వే ఆధారంగానే కౌన్సిలర్ టికెట్లు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

సర్వే ఆధారంగానే కౌన్సిలర్ టికెట్లు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
  •     మ్యాచ్​ ఫిక్సింగ్ కు పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం
  •     మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మెదక్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచించారు. మెదక్​ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి బుధవారం మెదక్​ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో దరఖాస్తులు స్వీకరించారు. 

పార్టీ పరంగా అన్ని వార్డుల్లో సర్వే నిర్వహిస్తున్నామని, ఆ రిపోర్ట్​ ఆధారంగానే గెలుపు అవకాశాలున్న వారికి టికెట్లు ఇస్తామన్నారు. టికెట్ రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్​ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్​ నాయకులు ఎవరైనా ఇతర పార్టీల నాయకులతో మ్యాచ్​ఫిక్సింగ్ కు పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. 

మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా చైర్మన్​ పదవి దక్కించుకొని మాజీ మంత్రి హరీశ్​రావును ఇటువైపు రాకుండా చేయాలని సూచించారు. డీసీసీ ప్రసిడెంట్ ఆంజనేయులు గౌడ్​ మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు సర్వే ​ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు చంద్రపాల్, గంగాధర్, బాలకృష్ణ, వెంకటరమణ, పవన్, గూడూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.