కార్యకర్తల నిర్ణయమే ఫైనల్ 

కార్యకర్తల నిర్ణయమే ఫైనల్ 

పంజాబ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను తెరదించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ మధ్య సఖ్యత కుదిర్చేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారు. సీఎం అభ్యర్థిపై వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో రాహుల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. పంజాబ్ లో సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యకర్తల నిర్ణయాన్ని స్వాగతిస్తామని..వారు ఎవరిని కోరుకుంటే వారినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఇద్దరిలో ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా మరొకరు వారికి సహాయ సహకారాలు అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. వీరిద్దరు నేతలతో మాట్లాడానని ఈ విషయంలో తనకు వారు హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. ఒక పార్టీకి ఇద్దరు నాయకులు సారధ్యం వహించలేరు. ఒక్కరే నాయకత్వం వహిస్తారని చెప్పారు.  

మరిన్ని వార్తల కోసం

రణరంగంగా మారిన బిహార్ 

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..