రణరంగంగా మారిన బిహార్ 

రణరంగంగా మారిన బిహార్ 

బిహార్ రణరంగంగా మారింది. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. రహదారులకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకుంటున్నారు. టైర్లను తగలబెడుతూ తమ నిరసన తెలియజేస్తున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షా ఫలితాల్లో అక్రమాలు జరిగాయని  ఆరోపిస్తూ విద్యార్థులు బిహర్ బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్జేడీ, ఎన్డీయే మిత్రపక్షాలు కూడా విద్యార్థుల బంద్ కు మద్దతు తెలిపాయి. ఆర్ఆర్ బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కోసం రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నోటిఫికేషన్ లో ఒక పరీక్ష మాత్రమే అని పేర్కొన్నదని తెలిపారు. తర్వాత మరోసారి పరీక్షకు హాజరుకావాలని కోరడం అన్యాయమన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ డీ పరీక్షలో కూడా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడంపై మండిపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు ఆదుకుంటున్నారని ఆరోపించారు.  

మరిన్ని వార్తల కోసం

ఆస్పత్రుల్లో కరోనా చేరికలు తక్కువున్నయ్

రీజినల్ భద్రత సాధిద్దాం