రీజినల్ భద్రత సాధిద్దాం

రీజినల్  భద్రత సాధిద్దాం
  • ఒకరికొకరం సహకరించుకుంటేనే.. రీజినల్ సెక్యూరిటీ సాధ్యం
  • ఇండియా-సెంట్రల్‌‌‌‌ ఆసియా సమిట్‌‌‌‌లో మోడీ

న్యూఢిల్లీ: సెంట్రల్ ఆసియా ప్రాంతంలో ఒకరికొకరం సహకరించుకుంటేనే.. ప్రాంతీయ భద్రత సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అఫ్గానిస్తాన్‌‌‌‌లో ప్రస్తుత పరిస్థితులు, రీజినల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇండియా– సెంట్రల్ ఆసియా దేశాల మధ్య గురువారం జరిగిన మొదటి సమిట్‌‌‌‌లో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇండియా–సెంట్రల్ ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు 30 ఏండ్లుగా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. 

  • మూడు టార్గెట్లు పెట్టిన మోడీ 

రీజినల్ స్టెబిలిటీకి పరస్పరం సపోర్ట్‌‌‌‌ చేసుకోవడం ఫస్ట్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ కావాలని మోడీ తెలిపారు. దానికి ప్రత్యేకంగా పాలసీ ఉండాలన్నారు. భాగస్వామ్య దేశాల మధ్య చర్చల కోసం వేదికను ఏర్పాటు చేసుకోవడానికి ఆ పాలసీ ఉపయోగపడుతుందని, అది మన రెండో లక్ష్యమని చెప్పారు. ఇక రీజినల్ కనెక్టివిటీకి, సపోర్ట్‌‌‌‌కు సరైన రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను తయారు చేసుకోవడం మూడో టార్గెట్‌‌‌‌ అని పేర్కొన్నారు.