కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్

న్యూఢిల్లీ, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేశ్ ను హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల కారు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా బైపోల్ జరగనుంది.

2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 17,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి గద్దర్ కూతురు వెన్నెల, బీజేపీ నుంచి శ్రీగణేష్​ పోటీ పడ్డారు. శ్రీగణేష్ 40 వేల ఓట్లతో సెకండ్ ప్లేస్​లో నిలిచారు. వెన్నెల 20 వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే, మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు.