బండి సంజయ్పై చర్యలు తీసుకోండి..ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

బండి సంజయ్పై చర్యలు తీసుకోండి..ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలపరిచే సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ. 10 లక్షల నిధులు ఇస్తానన్న కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘనేనని, ప్రజలను ప్రలోభపెట్టడమేనని ఆరోపించింది. 

ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పీసీసీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ రాజేశ్, ఇతర ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై వెంటనే దర్యాప్తు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.