15 లోక్ సభ సెగ్మెంట్ లకు స్క్రీనింగ్ కమిటీలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

15 లోక్ సభ సెగ్మెంట్ లకు స్క్రీనింగ్ కమిటీలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం కోసం ఏర్పాటు
  •     చైర్మన్​లుగా మంత్రులు, కన్వీనర్లుగా డీసీసీ చీఫ్​లు 
  •     సభ్యులుగా ఎంపీల నియామకం
  •     హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా అన్ని సెగ్మెంట్లు ఫైనల్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం, టికెట్ల ఖరారులో పారదర్శకత, పార్టీ నుంచి రెబల్స్ పోటీ చేయకుండా కట్టడి చేసేందుకు పీసీసీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులను చైర్మన్ లుగా స్ర్కీనింగ్ కమిటీలను పీసీసీ నియమించింది. వీటిని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గురువారం హైదరాబాద్ లో మీడియాకు ప్రకటించారు. డీసీసీ చీఫ్​లు కన్వీనర్లుగా, ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఉండనున్నారు. ఒక్క ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని, మిగితా 14 నియోజకవర్గాలకు మంత్రులను చైర్మన్​లుగా నియమించారు. 

పెద్దపల్లికి జూపల్లి కృష్ణా రావు, కరీంనగర్ కు తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్ కు అజారుద్దీన్, మెదక్ కు వివేక్ వెంకటస్వామి, మల్కాజిగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్ బాబు, మహబూబ్ నగర్ కు దామోదర రాజనర్సింహా, నాగర్ కర్నూల్ కు వాకిటి శ్రీహరి, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, వరంగల్ కు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహబూబాబాద్ కు పొన్నం ప్రభాకర్, ఖమ్మంకు కొండా సురేఖను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు.