బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.. ఎంఐఎం సీ టీమ్: జైరాం రమేష్

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.. ఎంఐఎం సీ టీమ్: జైరాం రమేష్

తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్, ఎంఐఎం సీ టీమ్ గా మారాయని తెలిపారు. పెట్టుబడులు అన్నీ హైదరాబాద్ లో కేంద్రీకృతమయ్యాయని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కు బైబై చెప్పే రోజు వస్తోందన్నారు. 

జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం కలిగిందని జైరాం రమేష్ అన్నారు. తెలంగాణలో గతేడాది అక్టోబర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని.. అందులో భాగంగా రాహుల్ సుమారు 405 కిలో మీటర్ల పాదయాత్ర చేశారన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొత్త ఊపునిచ్చిందన్నారు. భారత్ జోడో యాత్ర రాష్ట్రనేతల్లో విశ్వాసం నింపిందని వివరించారు.