కాంగ్రెస్​ హైకమాండ్ ఫోకస్.. సీనియర్ల మీటింగ్ క్యాన్సిల్

కాంగ్రెస్​ హైకమాండ్ ఫోకస్.. సీనియర్ల మీటింగ్ క్యాన్సిల్

రాష్ట్ర కాంగ్రెస్ లో రచ్చ కంటిన్యూ అవుతోంది. సీనియర్లు వర్సెస్ పీసీసీ వర్గం నేతల మధ్య రగడ కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య వివాదం ముదురుతుండటంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. అటు ప్రియాంకా గాంధీతో పాటు సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలపై నజర్ పెట్టారు. ముందస్తు నిర్ణయం ప్రకారం మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కావాల్సి ఉంది. దీంతో సీనియర్ల ఇవాళ్టి సమావేశం వాయిదా పడింది. 

అయితే మీడియాతో చిట్  చాట్ చేసిన CLP నేత భట్టి విక్రమార్క.. తాము ఎవరినీ రాజీనామా చేయాలని అడగలేదన్నారు. రిజైన్ చేసిన వాళ్లంటే తమకు గౌరవం అన్నారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి జనరల్ సెక్రటరీ పదవులు వచ్చాయన్న భట్టి.. పార్టీలో ఏళ్లతరబడి ఉన్నవారికి పదవులివ్వాలని కోరామన్నారు. గాంధీభవన్ లో ఉంటూ వైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యం దక్కుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ అబ్జర్వర్ గా రావటంపై హర్షం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న దిగ్విజయ్ సింగ్ కు రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసన్నారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ లో సమస్యలు పరిష్కరిస్తరనే నమ్మకం ఉందన్నారు. హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రచారానికి ఎందుకు వెళ్లలేదో విచారణ చేయాలన్నారు. సీనియర్లకు అన్యాయం జరిగిందని..కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదన్నారు.