పేదలకు గూడు కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆవుల రాజిరెడ్డి

పేదలకు గూడు కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆవుల రాజిరెడ్డి
  •  నర్సాపూర్ కాంగ్రెస్​ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి

శివ్వంపేట, వెలుగు:  నిరుపేదలకు కూడు, గూడు కల్పించడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మండలంలోని చిన్నగొట్టిముక్కుల, గుండ్లపల్లి గ్రామాల్లో ప్రభుత్వం నుంచి మంజూరై, నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల్లో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

కార్యక్రమంలో గుండ్లపల్లి సర్పంచ్ మమత నర్సిములు యాదవ్, గోమారం సర్పంచ్ హైమావతి ఆంజనేయులు, తాళ్లపల్లి తాండ సర్పంచ్ లక్ష్మీ గేమ్ సింగ్, రూప్లతండా సర్పంచ్ కిషన్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, మండల సీనియర్ నాయకులు నవీన్ గుప్తా, సత్యనారాయణ గౌడ్, రాములు పాల్గొన్నారు.