ఫిబ్రవరి 28న కాంగ్రెస్ కిసాన్ సెల్ రైతు ర్యాలీ

ఫిబ్రవరి 28న కాంగ్రెస్ కిసాన్ సెల్ రైతు ర్యాలీ

హైదరాబాద్, వెలుగు:  ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 28న నిజాం కాలేజీ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతులతో ర్యాలీ నిర్వహిస్తామని కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి చెప్పారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ర్యాలీని విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశంలో నల్ల చట్టాలను ఎత్తేస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. 

మోదీ సర్కార్ దేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాదని విమర్శించారు. స్వామి నాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి, మోదీ మోసం చేశారని అన్వేశ్ పేర్కొన్నారు.