కొడంగల్, వెలుగు: ప్రజల సహకారంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి అన్నారు. శనివారం కడా కార్యాలయంలో రోడ్డు విస్తరణలో నిర్మాణాలు కోల్పోయిన 108 మంది నిర్వాసితులకు రూ.2.84 కోట్ల చెక్కులను అందజేశారు. కొడంగల్ మున్సిపాలిటీలో రూ.400 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అనంతరం రైతులకు సడ్సిడీ స్ప్రేయర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, డీఈవో రాజారత్నం, లైబ్రరీ చైర్మన్ రాజేశ్రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ పాల్గొన్నారు.
