రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి సరైనోడు : అద్దంకి దయాకర్

రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి సరైనోడు : అద్దంకి దయాకర్

 

  • రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి సరైనోడు
  • టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తనను ఒక అస్త్రంగా వాడుకుంటుందేమోనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. తన భవిష్యత్తు ఏఐసీసీ హైకమాండ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేతుల్లో ఉందన్నారు. దయాకర్ ​మీడియాతో మాట్లాడుతూ ‘నేను నిఖార్సయిన కార్యకర్తను. పార్టీ కోసం పనిచేశా. పార్టీ ఎలా ఉపయోగించుకోవాలనుకున్నా సిద్ధంగా ఉన్నా. త్వరలో మంచి పొజిషన్​వచ్చే చాన్స్ ఉంది.

 రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి సరైనోడు. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కారణంగానే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే కుట్రచేస్తున్నరు. బీఆర్ఎస్​ను బెదిరించేందుకే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్​ను వాడుకుంటున్నరు. మోదీ,- అమిత్ షాల ముద్దుబిడ్డ కేసీఆర్. ఆయన చేసిన అవినీతిని కాపాడింది బీజేపీనే’ అని దయాకర్ అన్నారు.