మంత్రుల ఇండ్లు ముట్టడిస్తాం కేసీఆర్ : అద్దంకి దయాకర్

మంత్రుల ఇండ్లు ముట్టడిస్తాం కేసీఆర్ : అద్దంకి దయాకర్

ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ఎన్నికలకు పోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అద్దం దయాకర్ ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసమే నోటిఫికేషన్లు ఇచ్చినట్లు ఉందని అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో  4 మీటర్ల లాంగ్ జంప్ పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు.  రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేని కేసీఆర్ దేశ ప్రజలకు ఏం చేస్తారని విమర్శించారు. పోలీస్ అభ్యర్థుల సమస్య పరిష్కరించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రశ్నపత్రంలో 10 తప్పులు ఇచ్చిన ప్రభుత్వం అభ్యర్థులకు ఇరవై మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. 

పోలీస్ రిక్రూట్మెంట్లో నష్టపోయిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అధికారులు అడ్డగోలు నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.