గల్ఫ్ కార్మికులపై హరీశ్వి అన్ని అబద్ధాలే..కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ ఫైర్

గల్ఫ్ కార్మికులపై హరీశ్వి అన్ని అబద్ధాలే..కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: గతంలో ఆర్థిక మంత్రిగా ఉండి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక్క పైసా కేటాయించని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. ఇప్పుడు వారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ విమర్శించారు. 

ఈ మేరకు శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు వేల మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులు చనిపోతే వారికి పైసా ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వలేదని ఆరోపించారు. రేవంత్ సర్కార్ మాత్రం గల్ఫ్ భరోసా పేరుమీద వారికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.