జర్నలిస్ట్ పై దాడి కేసులో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అరెస్ట్

జర్నలిస్ట్ పై దాడి కేసులో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అరెస్ట్

జర్నలిస్టుపై దాడి కేసులో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు పోలీసులు. గురువారం రాత్రి  ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ కవరేజ్ కోసం జర్నలిస్ట్ వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్న సమయంలో అడ్డుగా ఉన్న జర్నలిస్ట్ ను  ఫిరోజ్ ఖాన్ తోసేసి తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ విషయంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు జర్నలిస్ట్. దీంతో ఆగ్రహించిన ఫిరోజ్ ఖాన్ తన అనుచరులతో కలిసి ఆ జర్నలిస్ట్ పై దాడి చేశాడు. దీంతో ఆ జర్నలిస్ట్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫిరోజ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.

80 శాతం మందికి కరోనా వచ్చిపోయింది

కేబుల్ బ్రిడ్జిపై రోడ్డుకు అడ్డంగా సెల్ఫీలు