మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కన ఇందిరాగాంధీ ఫోటో పెట్టి పూజించేది: జగ్గారెడ్డి

 మా అమ్మ  దుర్గామాత ఫోటో పక్కన ఇందిరాగాంధీ ఫోటో పెట్టి పూజించేది: జగ్గారెడ్డి

దివంగత ఇందిరాగాంధీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. తమ ఇంట్లో  దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టి అమ్మ పూజించేదన్నారు. గొప్ప కోసం కాదు.. ఇవన్నీ నిజాలే కాబట్టి చెబుతున్నానన్నారు. ఇందిరాగాంధీనీ అటల్ బిహార్ వాజ్ పేయి కూడా అపర కాళీ అని ప్రశంసించారని అన్నారు.

గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి. 1971 లో పాకిస్తాన్..భారత్ కి  యుద్ధం జరిగింది.  అప్పుడు ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు  ధైర్యాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంది. ఇందిరా గాంధీ యుద్ధం చేసే సమయంలో కూడా ప్రతిపక్షంతో  విమర్శలేకుండా చేశారు.  ఈ మధ్య పాకిస్తాన్  ఇండియా మధ్య యుద్ధం జరుగుతుంటే ఇందిరా గాంధీ గుర్తొచ్చారు.  రాజకీయాలకు అతీతంగా ఇందిరాగాంధీ నిర్ణయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమెరికా అప్పట్లో కూడా యుద్ధం ఆపాలని చూసింది.. కానీ ఇందిరాగాంధీ ఊరుకోలేదు .  భారత దేశ ప్రజల నిర్ణయంలో తలదూర్చొద్దు అని బాహాటంగానే ఇందిరా గాంధీ చెప్పారు.  తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రధాని తల వంచారు.

1971 లో ఇండియాకి పాకిస్తాన్ తలవంచింది. పార్లమెంట్ లో రాజకీయాలకు అతీతంగా వాజ్ పేయి ఇందిరా గాంధీని పొగిడారు. కులమతాలకు అతీతంగా అందరూ ఆమెను అభినందించారు. ఇందిరా గాంధీ వస్తున్నారు అంటే మూడు రోజుల ముందే సభ పెట్టే స్థలంలో ప్రజలు ఉండే వారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకి పోయేవాన్ని. మా ఇంట్లో మా అమ్మ దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టి పూజించేది. గొప్ప కోసం కాదు..నిజాలు కాబట్టి చెప్తున్నా అని అన్నారు.