నువ్వేమైనా తీస్మార్ ఖాన్ వా.?. మేం తొడగొడ్తే నీ గుండె అదురుతది: జగ్గారెడ్డి

నువ్వేమైనా తీస్మార్ ఖాన్ వా.?. మేం తొడగొడ్తే  నీ గుండె అదురుతది: జగ్గారెడ్డి

మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసేంత దమ్ము కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్..తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా?  మేం తొడగొడితే కేటీఆర్ గుండె అదురుతదని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.  కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేయలేనిది..సీఎం రేవంత్ ఒక్క నెలలో చేశారని కొనియాడారు జగ్గారెడ్డి. 

కేసీఆర్ తొమ్మిదన్నరేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు జగ్గారెడ్డి. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఫైనాన్స్ ను ఉన్నకాడికి ఊడ్చేశారు.. బడ్జెట్ ను మొత్తం నాకి నాకి పడేశారు. అన్నం వండిన గిన్నెలో మాడు లేకుండా  మొత్తం నాకేశారు, సర్ఫ్ వేసి కడగాల్సి అవసరం లేకుండా  చేశారని ధ్వజెమెత్తారు జగ్గారెడ్డి

కోదండరాంను ఉద్యమ సమయంలో దేవుడి లెక్క చూశారన్నారు. తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్  కోదండరాంకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కోదండరాంను బీఆర్ఎస్ వాళ్లు అగౌర పరిస్తే..తాము ఎమ్మెల్సీ ఇచ్చి  గౌరవిస్తున్నామని చెప్పారు. 

బట్టలూడదీసి ఉరికిస్తాం: కేటీఆర్

జనవరి 25న కరీంనగర్ పార్లమెంట్ సోషల్ మీడియా సమావేశంలో  మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ వి 420 హామీలు ఉన్నాయని..వాటిని అమలు చేయకపోతే బట్టలూడదీసి ఉరికించే రోజులు వస్తాయన్నారు కేటీఆర్.