కేసీఆర్ వి మాటలు త‌ప్ప‌ చేతల్లో ఏమీ కనిపించదు

కేసీఆర్ వి మాటలు త‌ప్ప‌ చేతల్లో ఏమీ కనిపించదు

జగిత్యాల జిల్లా : కరోనా కట్టడికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామన్న కేసీఆర్ వి మాటలు త‌ప్ప‌ చేతల్లో ఏమీ కనిపించడంలేదన్నారు కాంగ్రెస్ లీడ‌ర్ జీవ‌న్ రెడ్డి. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌..విద్యా, వైద్యం ప్రజలకు కల్పించండం రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కు అన్నారు. కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వాసుపత్రుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవ‌న్నారు. 50 వేల వైద్యసిబ్బందిని రెండు మూడు నెలల కోసం తాత్కాలిక రిక్రూట్ చేసుకుంటామని.. మే 9న రివ్యూ మీటింగ్ లో చెబితే.. ఇప్పటివరకూ పదిహేను రోజులు గడుస్తున్నా... అతీగతీ లేదన్నారు. దీనిపై ఎంత మంది స్టాఫ్ ను నియమించారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.

టిమ్స్ కోవిడ్ సెంటర్ లో ఇంతవరకూ సిటీ స్కాన్ లేని దుస్థితి అని.. బ్లాక్ ఫంగస్ కోసం ఏర్పాటు చేసిన కోఠి ఈఎన్టీలో గానీ... ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో గానీ.. కనీసం సిటీ స్కాన్ మిషన్సే లేవన్నారు. రాష్ట్రంలో 5 శాతం కంటే తక్కువ కేసులు నమోదైనప్పుడు మాత్రమే లాక్ డౌన్ ఎత్తేస్తానంటున్న కేసీఆర్ వన్నీ తప్పుడు లెక్కలే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 శాతం కేసులు నమోదైనట్టు చూపిస్తే.. జిల్లాల వారీగా 17 నుంచి 18 శాతం కేసులు నమోదవుతున్న‌ట్లు లెక్కలు బయటపడుతున్నాయన్నారు. మరి ఏది కరెక్ట్...?  ఏది రాంగ్...?  కేసీఆరే చెప్పాలని ప్రశ్నించారు.