కేసీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలి: నిరంజన్‌‌‌‌

కేసీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలి: నిరంజన్‌‌‌‌
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలి
  • ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసులో వారిద్దరి పేర్లు బయటపడ్డాయి: నిరంజన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, హరీశ్‌‌‌‌ రావు పేర్లను ఎస్‌‌‌‌ఐబీ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తావించినందున వారిపై చర్యలకు కాంగ్రెస్‌‌‌‌ కోరింది. దీనిపై స్పీకర్ వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభ నుంచి వారిద్దరిని బహిష్కరించాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవ స్థలను ఉపయోగించడమే కాకుండా ప్రత్యేక పరికరాలను తెప్పించి ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడ్డ ఇలాంటి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలన్నారు. కఠిన చర్యలు ఉంటేనే రానున్న రోజుల్లో అధికారంలో ఉన్న నేతలు ఇలాంటి తప్పుడు పనులు చేయరని పేర్కొన్నారు.