- ఇది ఎవరి వైఫల్యం, ఎవరు బాధ్యత వహిస్తారు: కాంగ్రెస్నేత పవన్ఖేరా
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు దాడి ఘటనపై ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్పార్టీ మీటింగ్నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. డిసెంబర్ 1 నుంచి మొదలవనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను ముందుగానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కుదిపేసిన బాంబ్ బ్లాస్ట్పై చర్చించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. గురువారం ఢిల్లీలో పవన్మీడియాతో మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత ఇండియాలో జరిగే ఏ టెర్రరిస్టు దాడినైనా దేశంపై యుద్ధచర్యగా పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రకటన అమలులో ఉందా అని ప్రశ్నించారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుటు కాంగ్రెస్‌పార్టీ కేంద్ర ప్రభుత్వంతో పాటు నిలిచిందన్నారు.
భవిష్యత్తులో కూడా అలాగే ఉంటామన్నారు. అయితే ఈ దుర్ఘటన ఎవరి వైఫల్యం, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించడం ప్రతిపక్షంగా మా బాధ్యతన్నారు. ‘‘13 మందిని బలిగొన్న బాంబ్ బ్లాస్ట్జరిగిన 48 గంటల తర్వాత, దాన్ని టెర్రరిస్టు ఎటాక్అని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఇంత నిఘా ఉండీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతను నిశితంగా గమనిస్తున్నప్పటికీ.. 2,900 కిలోల పేలుడు పదార్థం ఫరీదాబాద్‌కు ఎలా వచ్చింది. ముంబై దాడుల తర్వాత కేంద్ర హోంమంత్రిగా ఉన్న శివరాజ్ పాటిల్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ కు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వంలో జవాబుదారితనం ఉండాలి కదా” అని పవన్ ప్రశ్నించారు.
