పఠాన్‌కోట్‌లో ప్రియాంక గాంధీ పర్యటన

పఠాన్‌కోట్‌లో ప్రియాంక గాంధీ పర్యటన

పంజాబ్‌ రాష్ట్రంలో పర్యటించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. పఠాన్‌కోట్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పంజాబియాత్ అనేది సర్వశక్తిమంతుడి ముందు తప్ప ఎవరి ముందు తలవంచని భావం అన్నారు. మీ ముందుకు వచ్చి పాంజబియాత్ గురించి మాట్లాడే అన్ని రాజకీయ పార్టీలలో ఒకటి ఇప్పటికే దాని పారిశ్రామికవేత్త స్నేహితుల ముందు తలవంచిందన్నారు. మోడీ ప్రభుత్వం... చెరుకు రైతులకు రూ.14 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. ఆందోళన చేస్తున్న రైతులను ఒక్కసారి కూడా కలవలేదన్నారు. దానికి బదులు మోడీ కేబినెట్ మంత్రి కొడుకు తన వాహనంతో ఆరుగురు రైతులను నరికి చంపారని విమర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. 

ఎన్నికల కోసం ప్రధాని పఠాన్‌కోట్‌కు వచ్చారన్నారు. కానీ.. రైతులను కలవడానికి మాత్రం ఆయన తన నివాసం నుండి 5-6 కి.మీ  ప్రయాణించలేకపోయారన్నారు. ఓ సంవత్సరం పాటు రైతులను ఆందోళనకు గురి చేశారన్నారు. అమెరికా, కెనడా ప్రధాని సందర్శించారన్నారు. ప్రపచమంతా పర్యటించి..  తన కోసం రూ. 16,000 కోట్ల విలువైన రెండు ఛాపర్‌లను కొనుగోలు చేశారన్నారు ప్రియాంక గాంధీ.  పంజాబ్‌ను పంజాబీలు నడపాలని సీఎం చరణ్‌జిత్‌ చన్నీ అన్నారు. అయితే ఆయన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు ప్రియాంక. పంజాబ్‌కు వచ్చి పాలించేందుకు యూపీ నుంచి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాను అనుకోవడం లేదన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా.