దేశ సైన్యాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది : రాహుల్

దేశ సైన్యాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది : రాహుల్

అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉపసంహరించుకునే వరకూ పోరాటం చేస్తామని కాంగ్రెస్  అధినేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్’ గురించి మాట్లాడిన బీజేపీ పెద్దలు.. ఇవాళ ‘ర్యాంకు లేదు, పెన్షన్ లేదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నివీర్ ల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ఒకసారి ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందితే వారికి ఎలాంటి ఉపాధి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశ సైన్యాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని  రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాన్ని బలోపేతం చేయడానికి నిజమైన దేశభక్తి అవసరమన్నారు. పథకాన్ని రద్దు చేసే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహం కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో అగ్నిపథ్ పథకాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారు.