
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏపీ దుర్భుద్ది వల్ల దక్షిణ తెలంగాణ కు తీరని అన్యాయం జరగుతోందని కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ అన్నారు. ఆర్డీఎస్ ద్వారా 16 టీఎంసీల కేటాయింపులు ఉన్నా రావడం లేదన్నారు. ఆర్డీఎస్‌కు సమాంతరంగా మరో కాలువ తవ్వి ఏపీ దౌర్జన్యంగా నీళ్లు తరలిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అలంపూర్ నియోజకవర్గం అంధకారంగా మారనుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఏపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవాలన్నారు. పాదయాత్ర, దీక్షలు చేయడం కాదు.. ఆర్డీఎస్ నీళ్లు సాధించడానికి యుద్ధం చేస్తామని అన్నారు.