కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

గోదావరిపై ప్రాజెక్టుల దగ్గర ఇవాళ  జల దీక్ష చేయాలని నిర్ణయించారు కాంగ్రెస్ నేతలు. దీంతో రాత్రి నుంచే జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.  ఆదిలాబాద్ జిల్లా కగజ్ నగర్ గోదావరి నది దగ్గర తుమ్మిడి హాట్టి ప్రాజెక్ట్ సందర్శనకు బయల్దేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును అడ్డుకోని ఆయనను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కరీంనగర్ లో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ను హౌస్ అరెస్టు చేశారు. ఇల్లందు చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ను రాత్రి ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో పోలీసులు అడ్డుకొని జల దీక్షకు వెళ్లకుండా అరెస్టు చేశారు.