
షాద్ నగర్, వెలుగు : కాళేశ్వరం అవినీతిలో ముందుగా జైలుకు పోయేది హరీశ్ రావే అని షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పీసీపీ సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పి . రఘు మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీశ్ రావు నోరు పారేసుకున్నారని ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
దళిత ముఖ్యమంత్రి, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం హామీలు మరిచినందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, గిరిజన నేత శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.