- డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి
- అక్రమ దందాలు నడవకనే కాంగ్రెస్ వీడిన మూల రాజిరెడ్డి
- చెన్నూరు, కోటపల్లిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు
కోల్‌బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కావాలని ఆరోపణలు చేస్తున్నారని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రాఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. గురువారం రామకృష్ణాపూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి వివేక్‌పై జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత అవసరాల కోసం మూల రాజిరెడ్డి, ఇతరులు కాంగ్రెస్ ను వీడినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో ఇసుక, బియ్యం దందాలు, భూకబ్జాలు, బెదిరింపు రాజకీయాలు చేసిన లీడర్లు ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి కోసం పాటుపడే మంత్రి వివేక్‌వెంకటస్వామి చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు నాలుగు రోజుల్లో రూ.112.24 కోట్ల ఫండ్స్రిలీజ్ చేయించి పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. నీతి నిజాయితీతో పాలన అందిస్తున్న మంత్రిపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు. సమావేశంలో కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, నాయకులు మహంకాళి శ్రీనివాస్, గండ్ల సమ్మయ్య, యాకూబ్ అలీ, మెట్ట సుధాకర్, పనస రాజు, గోపతి బానేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్‌పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు
మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదిలేదని కోటపల్లి మండలంలోని కాంగ్రెస్ సర్పంచ్‌లు, మండల సీనియర్ నేతలు హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మూల రాజిరెడ్డికి రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాకా వెంకటస్వామి కుటుంబం బిక్ష వల్లనే రాజకీయ పదవులు పొంది, అలాంటి కుటుంబం గురించి అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మంత్రి వివేక్‌వెంకటస్వామి హయాంలో తన అక్రమ దందాలు సాగవనే పార్టీ మారాడని అన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు ఆలూరి సంపత్, పోలవేన రాకేశ్, రాజేశ్ నాయక్, పొన్నాల తిరుపతి, డోంగ్రే రాజేశ్వరి, తాళ్ల వెంకటమ్మ బాపు, ఏఎంసీ డైరెక్టర్లు శశిపాల్ రెడ్డి, బద్దె నాయక్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మంత్రి చేసిన అభివృద్ధి కనిపించడం లేదా?
మంత్రి వివేక్‌పై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదని చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు మూల రాజిరెడ్డిపై అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మున్సిపాలిటీల్లోని ప్రతి గల్లీలో మార్నింగ్ వాక్ చేసి ప్రజలను కలిసి వారి సమస్యలు విని, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు కట్టించారని గుర్తుచేశారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి మోడల్ గా తీర్చిదిద్దున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో చెన్నూరు నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పుడు సుమన్ ఎక్కడ పోయాడని ప్రశ్నించారు.
ముంపు బాధితులకు నష్టపరిహారం ఇప్పించిన ఘనత మంత్రి వివేక్ కు దక్కుతుందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు సూర్యనారాయణ, అంతారెడ్డి, చింతల శ్రీనివాస్, సుశీల్,చెన్న వెంకటేశ్, అంకాగౌడ్, చెన్నూరి శ్రీధర్,రాజేశ్తదితరులు పాల్గొన్నారు.
