ఓటుతో బీఆర్ఎస్​కు బుద్ధి చెబుదాం : నజీర్ హుస్సేన్

ఓటుతో బీఆర్ఎస్​కు బుద్ధి చెబుదాం : నజీర్ హుస్సేన్
  • రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ నజీర్ హుస్సేన్ 

షాద్ నగర్,వెలుగు : తెలంగాణ ప్రజల భవిష్యత్​నిర్ణయించే ఎన్నికలు అని, ఓటుతో బీఆర్ ఎస్ కు బుద్ధి చెబుదామని, అవినీతి ప్రభుత్వానికి చెక్ పెట్టే సమయం వచ్చిందని , ఆ దిశగా మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలంతా పని చేయాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు నజీర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం షాద్ నగర్ టౌన్ లో  నిర్వహించిన కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను మైనార్టీలు గెలిపించాలని సభ ఏర్పాటు చేశారు. ఏఐసీసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... 

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనల్లో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దొరతనం  పెరిగిపోయాయని, వాటికి స్వస్తి పలకాలంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, జమీరుఖాన్ మసూద్ అలీఖాన్ ముక్తార్ అలీ ముబారక్ ఖాన్,  మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి బాలరాజు గౌడ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.