బాల్క సుమన్ ఫొటోలను చెప్పులతో కొట్టిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు

బాల్క సుమన్ ఫొటోలను చెప్పులతో కొట్టిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ హైదరాబాద్ సిటీలోని ఎల్బీ నగర్ చౌరస్తాలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను ఊరేగించారు. బాల్క సుమన్ ఫొటోలను చెప్పులతో కొట్టారు మహిళా కార్యకర్తలు. అనంతరం బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతూ.. చెప్పులు చూపించటంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి.. వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బాల్క సుమన్ తీరు వ్యాఖ్యలను ఖండిస్తూ.. అతనిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా సరే.. బీఆర్ఎస్ నేతలు అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు నేతలు, కార్యకర్తలు.