ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తం: వీర్లపల్లి శంకర్

ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తం: వీర్లపల్లి శంకర్

షాద్ నగర్,వెలుగు: ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణ వాసుల కలలు సాకారం అవుతాయని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 23,24 వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అరాచకాలకు, దౌర్జన్యాలకు అడ్డాగా మారిందన్నారు. ప్రశ్నించే వాళ్లను కేసుల పేరుతో బీఆర్ఎస్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. శంకర్ వెంట పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత దంగు శ్రీనివాస్ యాదవ్, ఖదీర్, నల్లమోని శ్రీధర్, సుదర్శన్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.