థర్డ్ వేవ్‌తో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలె

థర్డ్ వేవ్‌తో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలె

హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్‌తో ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్‌‌పై నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. థర్డ్ వేవ్ విషయంలో ముందస్తు చర్యలపై సర్కార్ల ప్లాన్స్ ఏంటో చెప్పాలన్నారు. ఆక్సిజన్ లేమితో చాలా మంది చనిపోయారని, థర్డ్ వేవ్ పై WHO అలర్ట్ చేసిందని గుర్తు చేశారు. ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

‘థర్డ్ వేవ్ విషయంలో ముందస్తు ప్రణాళిక లేకుంటే చాలా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ బెడ్‌‌లను ఏర్పాటు చేసుకోవాలి. సీటీ స్కాన్ లాంటివి అందుబాటులో ఉంచాలి. సర్కార్ ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తే పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌కు వెళ్లరు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసతులు, డాక్టర్లు బాగానే ఉన్నారు. కానీ వసూళ్లే బాగోలేవు. లక్షలకు లక్షలు వసూల్ చేస్తున్నారు. రోగులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బలను దండుకుంటున్నారు. కరోనా ట్రీట్‌మెంట్ విషయంలో సర్కార్ రూల్స్ ప్రకారమే ఆస్పత్రులు ఫీజులు వసూల్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ పై రాష్ట్ర సర్కార్ డేగ కన్ను పెట్టాలి. అపోలో, యశోద, కిమ్స్ లాంటి హాస్పిటల్స్ పై టాస్క్ ఫోర్స్ దృష్టి పెట్టాలి’ అని జగ్గారెడ్డి చెప్పారు. 

పీసీసీ ఇవ్వాలని సోనియాకు లేఖ
‘పీసీసీ నియామకానికి ఇంకా సమయం ఉంది. అయితే ఆశావహులు ఎవరికి వారే ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు పీసీసీ ఇవ్వమని సోనియా గాంధీ, రాహుల్‌‌కు లేఖ రాశా. పీసీసీ ఇవ్వడం కుదరకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కోరా. కాంగ్రెస్‌‌లో అందరూ హీరోలే. ఎవ్వరూ తక్కువ కాదు. కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవికి ఎవరికి అప్పగించినా కలసికట్టుగా పనిచేస్తాం’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.