బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయి:జగ్గారెడ్డి

 బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయి:జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం ఈడీ, ఐటీలను వాడుతుంటే సీఎం కేసీఆర్ ఏసీబీని వాడుతున్నారని చెప్పారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈడీ, ఐటీ అధికారులు చెప్పాల్సిన మాటలను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చెప్తున్నారని, ఆయన ఈ డిపార్ట్ మెంట్లకు చీఫ్ ఎప్పుడయ్యారో అర్థం కావడంలేదన్నారు.

మల్లారెడ్డి ముందు నుంచే సంపాదిస్తున్నడని, గత ఎనిమిదేండ్ల నుంచి జరగని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. డబ్బులు ఇస్తే కాంగ్రెస్ లో పదవులు రావన్నారు. మర్రి చెన్నారెడ్డి డబ్బులు ఇచ్చే సీఎం అయ్యారా? అని ప్రశ్నించారు.