కేటీఆర్, హరీశ్ ప్రవర్తన చూస్తుంటే ఛీ అనిపిస్తున్నది

కేటీఆర్, హరీశ్ ప్రవర్తన చూస్తుంటే ఛీ అనిపిస్తున్నది
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మూసీ పక్కన నివాసం ఉంటున్న తనకు మూసీ కంపువాసన, ఆ బాధ తెలుసని.. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ ప్రవర్తన చూస్తుంటే ‘ఛీ’ అనిపిస్తున్నదని కాంగ్రెస్​ఎమ్మెల్యే శ్రీనివాస్​రెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీలో ఆయన మాట్లాడారు. 

మూసీ పక్కన ఉన్న ప్రజలకు రోగాలు వచ్చినా గత పాలకులకు పట్టించుకోలేదన్నారు. మూసీ దగ్గర ఉంటున్న చిన్నపిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి అందివ్వాలనుకోవడం ఈ ప్రభుత్వం చేసిన తప్పా?, కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చా? అని ప్రశ్నించారు. మూసీ నదికి ఇరువైపులా 25 లక్షల మంది నివాసం ఉంటున్నారని, మూసీ పక్కన పెంచిన గడ్డి తిని బర్లు, ఆవులు విషపు పాలను ఇస్తున్నాయని, అవే మనం తాగుతున్నామని తెలిపారు.