అడ్డంగా బుక్కై.. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎట్ల? : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

అడ్డంగా బుక్కై.. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎట్ల? :  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్

 హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ–కార్ రేసులో అడ్డంగా బుక్కయిన కేటీఆర్.. ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎలా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తప్పు చేయనప్పుడు జైలుకు వెళ్తాననే భయమెందుకని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మూడు సార్లు కాదు, 300 సార్లు అయినా విచారణకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే.. కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవాడన్నారు. చేసిన తప్పులకే కేటీఆర్​ జైలుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణ ప్రజల చేతిలో చావు దెబ్బలు తప్పవని అన్నారు.