కమీషన్లకు కక్కుర్తి ప‌డే ఎల్లంప‌ల్లి ప్రాజెక్ట్ ‌పై రెండో లింక్‌ ప‌నులు

కమీషన్లకు కక్కుర్తి ప‌డే ఎల్లంప‌ల్లి ప్రాజెక్ట్ ‌పై రెండో లింక్‌ ప‌నులు

జ‌గిత్యాల‌: కమిషన్లు దండుకోవడం కోసమే సీఎం కేసీఆర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై రెండో లింక్ పనులను చేపడుతున్నార‌‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం రాజారాం పల్లె లో జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఓ వైపు కాళేశ్వరం నీరు వృధాగా పోతుంటే, వాటిని సద్వినియోగం చేసుకోకుండా మరో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కమీషన్లకు కక్కుర్తి ప‌డి తెలంగాణ రాష్ట్ర ప్రజలపై 40 వేల కోట్ల భారం మోపుతున్నార‌న్నారు. మెగా కృష్ణా రెడ్డి ఇచ్చే కమీషన్ల కోసమే సీఎం ఈ మూడు టి.ఎం.సి ల‌ను ఏర్పాటు చేస్తున్నారని, అది రాష్ట్ర ప్రజానీకానికి గుదిబండ కాబోతుందని అన్నారు. దానికి నిదర్శనమే కాళేశ్వ‌రం ప్రాజెక్టు రెండు టిఎంసిల నీరు వాడకపోవడం అని అన్నారు.