‘యాదగిరి గుట్ట లో పవర్ ప్లాంట్ నిర్మించడానికి కారణం ఏంటి’

‘యాదగిరి గుట్ట లో పవర్ ప్లాంట్ నిర్మించడానికి కారణం ఏంటి’

యాదగిరి గుట్ట లో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించడానికి కారణం ఏంట‌ని మండ‌లిలో ప్ర‌శ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. బొగ్గు ఎక్కడ ఉంటే అక్కడ విద్యుత్ ప్లాంట్ల ను ఏర్పాటు చేయాలని.. రామగుండం లో వేల ఎకరాల్లో బొగ్గు ఉండ‌గా అక్కడ నిర్మించకుండా.. యాదాద్రిలో నిర్మించ‌డానికి కార‌ణ‌మేంట‌న్నారు .

కేంద్రం తీసుకు వచ్చిన విద్యుత్ చట్టాన్ని మండలి లో పెట్టి చర్చిస్తే బాగుండేదని అన్నారు జీవ‌న్ రెడ్డి.టీఆర్ఎస్ నాయకులు బయట బీజేపీ ని తిడుతూ… లోపల బీజేపీ తీసుకు వచ్చిన ప్రతీ చ‌ట్టాన్ని స‌పోర్ట్ చేస్తుంద‌న్నారు. కేంద్రం తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తీసేలా ఉంటే తాము కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తామ‌న్నారు.

విద్యుత్ రంగంలో రాష్ట్రం పురోగతి సాధించింది వాస్తవమేన‌ని.. అందుకు కార‌ణం కాంగ్రెస్సేన‌ని అన్నారు.ఉచిత విద్యుత్‌ను మొదట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని..దానికి కొనసాగింపు గా టీఆర్ఎస్ ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌న్నారు. ప్రాజెక్టులు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయేన‌ని అన్నారు.