అలా చేస్తే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తా

అలా చేస్తే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తా

సన్నబియ్యం పేదలకు పంపిణీ చేస్తే  కేసీఆర్ కు  పాలాభిషేకం చేస్తానన్నారు  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిరుపేదలకు పంపిణీ చేస్తే దేశ ప్రజలు గర్వించదగ్గ పని అవుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు, విత్తన రాయితీ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. గ్రేడ్ 1 వరి ధాన్యానికి రూ.1830 మద్దతు ఉందన్నారు. ఇంకా 10 శాతం పెంచితేనే గిట్టుబాటు అవుతుంది కానీ కేవలం 3 శాతమే పెంచారన్నారు.

నియంత్రణ సాగు విధానం ప్రపంచంలోనే ఎక్కడ లేదన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలు పండ్ల తోటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వటం ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. సన్నరకాలు అనే నెపంతో రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టాలని చూస్తుందన్నారు. ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఇద్దరికి మేలు కలిగేలా చూడాలన్నారు. సన్న రకాలుకు ప్రోత్సహిస్తే  క్వింటాలు వరికి కనీసం రూ.2500 మద్దతు ధర కల్పించాలన్నారు.

see more news

పర్యావరణ పరిరక్షణలో ఇతర దేశాలకు భారత్ మార్గదర్శి

ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

కదులుతున్న ట్రైన్ లో పసికందు..పరుగెత్తి పాల ప్యాకెట్ ఇచ్చిన కానిస్టేబుల్