
బడ్జెట్ బుక్ కేసీఆర్ వైఫల్యాల చిట్టాను తలపిస్తోంది. సగం బడ్జెట్ బుక్‌ను కేంద్రం గురించే ప్రింట్ చేసినట్టుంది.తాను ఏం చేస్తాడో చెప్పకుండా, ఎవరి మీదో పడి ఏడవటం ఎందుకు. బడ్జెట్‌లో ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి మాటే లేదు.. పీఆర్సీ, ఐఆర్ ఊసెత్తకపోవడంతో ఉద్యో గులకు నిరాశే మిగిలింది. ఆరోగ్య శ్రీని కొనసాగిస్తూనే ఆయుష్మాన్‌ను అమలు చేస్తే రాష్ట్రానికి కేంద్ర నిధులు అందుతాయి కదా. పార్లమెంట్ ఎన్నికలున్నయని రూ.1.84 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి, ఇప్పుడు తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నించి ఉంటే, రాష్ట్రానికి రూ.60 వేల కోట్లు మిగిలేవి. కమీషన్ల బాగోతం బయట పడుతదనే కేంద్రానికి దరఖాస్తు చేయలే. – కాంగ్రెస్ ఎమ్మెల్సీ, జీవన్‌రెడ్డి